Tuesday, November 26, 2024

సీఎం టార్గెట్​గా హనీట్రాప్​.. అమ్మాయి వలకు చిక్కిన పీఏ, పలు రహస్య పత్రాలు లీక్​!

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పర్సనల్​ సెక్రెటరీ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. అతడిని ట్రాప్​లో పడేసిన వ్యక్తులు పలు ఇంపార్టెంట్​, సీక్రెట్​ పేపర్స్​ని సొంతం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు ఇవ్వాల (శుక్రవారం) తెలిపాయి. దీనిపై పలు కుంభకోణాలను బహిర్గతం చేసిన రిజిస్టర్డ్ పబ్లిక్ ఆర్గనైజేషన్ జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ శర్మ విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శాసనసభ్యులను టార్గెట్​ చేసుకుని హనీట్రాప్ ముఠా పనిచేస్తుందని ఫిర్యాదుదారు ఆరోపించారు.

విధానసౌధలో పనిచేస్తున్న డి-గ్రూప్ మహిళా ఉద్యోగి బొమ్మై పీఏ హరీష్‌ను హనీ ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు తమ వీడియోలను రికార్డ్ చేసి, హరీష్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన పలు రహస్య పత్రాలను సేకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి సంతకంతో కూడిన పత్రాలను ప్రతిపక్ష నేతలకు ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

బెంగుళూరు సమీపంలోని కనకపుర రోడ్డు సమీపంలో నిందితురాలి పేరిట కోట్లాది రూపాయల విలువైన భూమిని హరీష్ కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు కూడా ఈ ముఠా పలువురు రాజకీయ నాయకులు, అధికారులను హనీట్రాప్ చేసిందని ఫిర్యాదుదారు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement