– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
- TV9 Bharatvarsh-Polstrat ఎగ్జిట్ పోల్ వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లతో దాదాపు 99 నుండి 109 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి దాదాపు 88-98 ఓట్లు రావచ్చనే అంచనాలున్నాయి.
- ఇక.. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) కేవలం 21-26 ఓట్లతో మూడో స్థానంలో వెనుకంజలో ఉండబోతున్నట్టు సర్వే చెబుతోంది.
- కాగా, టీవీ9 కన్నడ-సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్ దాదాపు 100-112 సీట్లు సాధిస్తుందని, కాషాయ పార్టీకి 83-95 ఓట్లు వస్తాయని అంచనా ఉంది.
- ఏషియానెట్ సువర్ణ న్యూస్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ కర్నాటకలో హంగ్ తీర్పును అంచనా వేస్తోంది. కాంగ్రెస్ దాదాపు 91-106 ఓట్లు, బీజేపీకి దాదాపు 94-117 ఓట్లు వస్తాయన్న అంచనాలున్నాయి.
- జీ మ్యాట్రిజ్ కూడా కర్నాటకలో హంగ్ రావచ్చని అంచనా వేస్తోంది.
- అదే విధంగా.. రిపబ్లిక్ కూడా కర్నాటకలో ఇదే పరిస్థితిని అంచనా వేస్తోంది. బీజేపీకి 85-100 సీట్లు, కాంగ్రెస్‌కు 94-108 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
- ABP News-C Voter కాంగ్రెస్‌కు 81-101 సీట్లు, బీజేపీకి దాదాపు 66-86 స్థానాలతో స్పష్టమైన మెజారిటీని రావొచ్చని అంచనా వేసింది. మరోవైపు నవభారత్ కర్నాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తోంది.