Thursday, November 21, 2024

మ‌ధ్య‌వ‌ర్తుల ఇళ్ల‌పై ఏసీబీ దాడులు – బంగారం, వెండితో పాటు వ‌జ్రాలు ల‌భ్యం

బెంగ‌ళూరు డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీలో ప‌ని చేసే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప్ర‌భావితం చేసి..వారి ద్వారా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోన్న మ‌ధ్య వ‌ర్తుల ఇళ్ల‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తొమ్మంది మంది ఏజెంట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మధ్యవర్తులు, మరికొందరు ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న అక్రమార్కుల ఇళ్లపై ఒకేసారి దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసు సూపరింటెండెంట్ ఉమా ప్రశాంత్ ఆధ్వర్యంలో 100 మంది అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఆర్టీ నగర్‌కు చెందిన మోహన్​అనే వ్యాపారవేత్త నుంచి సుమారు 5 కేజీల బంగారం, 15.02 కేజీల వెండి, 61.9 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 మందికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement