Saturday, November 23, 2024

క‌రీంన‌గ‌ర్ అభివృద్ధిపై దృష్టి – సుంద‌రంగా ముస్తాబ‌వుతోన్న ‘కేబుల్ బ్రిడ్జి’

క‌రీంన‌గ‌ర్ కు మ‌ణిహారంగా రూ. 183కోట్ల‌తో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు అయింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. క‌మాన్ నుండి కేబుల్ బ్రిడ్జి వ‌ర‌కు రూ.40కోట్ల‌తో రోడ్డు నిర్మాణం, సెంట్ర‌ల్ లైటింగ్ తో నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. మూడు నెల‌ల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తిస్థాయిలో సిద్ధం కానుంద‌న్నారు. క‌రీంన‌గ‌ర్ టు సిరిసిల్ల రోడ్ సుంద‌రంగా ముస్తాబు అవుతుంద‌న్నారు. మూడు నెలల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుందని.. కరీంనగర్ టు సిరిసిల్ల రోడ్ అద్భుతంగా తయారవుతుందని వెల్లడించారు.

కాకతీయ కెనాల్ పై ఒక బ్రిడ్జి మరో బ్రిడ్జి రెండు 30 కోట్లతో నిర్మాణం అవుతున్నాయని.. ఎన్నికలు అవ్వగానే కరీంనగర్ అభివృద్ధి పైనే దృష్టి పెట్టామని చెప్పారు. రూ. 350 నిధులు అభివృద్ధి కి కేటాయించగా రూ. 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి ఆయ్యాయి.మరికొన్ని పనులు త్వరలోనే జరగనున్నాయని.. కరీంనగర్ జిల్లా అభివృద్ధికే పాటుపడతామన్నారు. ఢిల్లీకి మేము బిచ్చగాళ్ల లాగా పోలేదని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తున్నాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి వ‌ద్ద ఇండియాలో మొట్ట మొద‌టిసారిగా ఆరు కోట్ల‌తో డైన‌మిక్ లైట్లు ఏర్పాటు అవుతుంద‌న్నారు. రైతుల‌కు స‌ర్వీస్ రోడ్డు ఇత‌ర స‌దుపాయాల‌కు ఏడు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement