తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. చాలా చోట్ల ఇళ్ల పట్టాలు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల సహకారం కానుంది. కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్ధుమ్ పూర్ గ్రామంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 16న బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా చేపట్టనుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో మంత్రి గంగుల కమలాకర్ అధికారులు ,స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది కొన్నిచోట్ల సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా ఇండ్ల నిర్మాణం పట్టాల పంపిణీ కార్యక్రమం కొంత జాప్యం జరిగి నట్టు మంత్రి వెల్లడించారు… కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 1400 ఇండ్లు మంజూరు అయినాయి.మౌలిక సదుపాయాలు పూర్తి కావడంతో దశలవారీగా అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల సాకారం కాబోతుంది ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ లో ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన నిరుపేదలకు అందించాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు…
డబుల్ బెడ్ ఇండ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం-నెరవేరనున్న నిరుపేదల చిరకాల వాంఛ
Advertisement
తాజా వార్తలు
Advertisement