బిగ్ బాస్ ఫ్రేమ్ కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది. నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మధురానగర్‌లో జరిగింది.
నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై మండిపడింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. అనంతరం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. అయితే, ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.