Monday, November 25, 2024

Trafficking: మాయమాటలతో ఆడాళ్లకు ఎర.. జాబ్స్​ పేరిట గల్ఫ్​కి అమ్మేస్తున్న ముఠా అరెస్టు!

మహిళలు, యువతులకు జాబ్​ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి, వారిని విదేశాలకు అమ్మేస్తున్న ముఠాని పోలీసులు కనిపెట్టారు. కాన్పూర్​కు చెందిన వ్యక్తి  ఒమన్‌కు పంపిస్తూ మహిళల అక్రమ రవాణా చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. దీంతో ఓ యువతిని ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

బాలిక తల్లిదండ్రులు కాన్పూర్ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించగా  క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. దీంతోఈ  విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రక్షించి భారత్‌కు తీసుకురావడమే కాకుండా క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

కాన్పూర్​కు చెందిన నిందితుడు వసీం గత ఏడాది జనవరిలో ఓ యువతిని ఒమన్‌కు పంపి ఆమెను వ్యభిచార రొంపిలోకి లాగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామనే సాకుతో వసీం ఒమన్​కి పంపాడని పోలీసులు తెలిపారు. అతను మొదట తన ఇంటి దగ్గరే ఓ ఉద్యోగం కల్పించాడని, నమ్మకం కుదిరిన తరువాత ఆ యువతిని విదేశాలకు పంపినట్టు విచారణలో వెల్లడైందన్నారు.

బాధిత యువతి తన కుటుంబానికి ఈ విషయం తెలియజేయగా.. ఆమె అగ్రిమెంట్​పై సంతకం చేయడంతో స్వదేశానికి తిరిగి రాలేకపోయిందని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె నిందితుడిని సంప్రదించినప్పుడు అతను ఫోన్‌లో బూతులు తిట్టాడని తెలిపింది.

తాజాగా.. ఒమన్ నుంచి ఇట్లాంటి మరో ముగ్గురు మహిళలను క్రైమ్ బ్రాంచ్ రక్షించింది. కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌లో, AHTU పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైందని DCP (క్రైమ్) సల్మాన్ తాజ్ పాటిల్ తెలిపారు. దీనిలో ఒక మహిళను మోసపూరితంగా ఒమన్‌కు పంపి, అక్కడికి చేరుకున్నప్పుడు ఆమెను మానసిక, శారీరక హింసకు గురిచేశారన్నారు. 

- Advertisement -

ఈ విషయంలో భారత రాయబార కార్యాలయాన్ని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించామని తెలిపారు. ఆరు నెలల్లో ఆ మహిళను రక్షించినట్టు వివరించారు. అక్రమ రవాణాకు గురైన ఇతర మహిళల సమాచారం కోసం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. అయితే, వసీం భాగస్వామి అయిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement