బిహార్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కన్హయ్యకు దక్కుతాయా..? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్లు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం కన్హయ్య వంటి మాటకారీ, మంచి వక్త పార్టీకి ఎంతో అవసరం ఉందంటున్నారు. కాగా, నాలుగేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన మదన్ మోహన్ ఝా రాజీనామాతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ బీహార్ యూనిట్ ఆలోచిస్తోంది. న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఝా రాజీనామా చేశారు. కాగా, ఈ పరిణామంపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
కొంతమంది పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముస్లిం, దళితుడు లేదా అగ్రవర్ణాలకు చెందిన ఎవరైనా ప్రాధాన్యంగా ఉండొచ్చని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీకి మాత్రం కన్హయ్య కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కనిపించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కిందటే సీపీఐని వీడి కాంగ్రెస్లో చేరిన జేఎన్యూ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, పటీదార్ ఉద్యమ లీడర్ అయిన హార్దిక్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ యూనిట్లో ప్రస్తుతం జరుగుతున్న కొత్త రక్తాన్ని నింపే ప్రయోగాన్ని కొనసాగించవచ్చు. అదనంగా, కాంగ్రెస్ నుండి RJD వైదొలగడం, తేజస్వి యాదవ్కు ప్రత్యర్థిగా పరిగణించబడే కన్హయ్య చేరికతో ముడిపడి ఉందని చెప్పబడింది, ఎందుకంటే ఇద్దరూ దాదాపు ఒకే వయస్సులో ఉన్నారు.