అదో చెత్త చిత్రమని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన గెహ్రాయాన్ చిత్రం ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ దీపికపదుకొనే నటించింది.
ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక రొమాంటిక్ సీన్ల మోతాదు శృతి మించిందని వస్తోన్న విమర్శలపై మరోనటి కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తాను కూడా నవ తరానికి చెందిన వ్యక్తినే కానీ, ఇటువంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలనని చెప్పింది. దయచేసి కొత్త తరం యువత, అర్బన్ సినిమాల పేరుతో ఇటువంటి చెత్తను అమ్మకానికి పెట్టకండంటూ ఆమె ఫైర్ అయ్యింది. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయని చెప్పుకొచ్చింది. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాలను ఏ మాత్రం కాపాడలేవంది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..