Tuesday, November 26, 2024

చెన్నై కి కండలేరు జలాలు విడుదల – ఈఈ విజయ్ కుమార్ రెడ్డి

రాపూరు: చెన్నై ప్రజలకు దాహార్తి తీర్చేoదుకు కండలేరు జలాలను విడుదల చేస్తున్నట్లు కండలేరు డ్యామ్ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.రాపూరు మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దనున్న పవర్ ప్లాంటులో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి,సారె సమర్పించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈఈ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ హరి నారాయణరెడ్డి సూచనల మేరకు చెన్నైకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అంచెలంచెలుగా పెంచుతూ 2,500 క్యూసెక్కుల వరకు పెంచుతామన్నారు.మొత్తం మూడు నెలల వరకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు.నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రైతుల రెండో పంటలకు అవసరమైన నీటిని విడుదల చేసేందుకు ఐఏబి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.రైతుల పంటలకు ఎటువంటి డొక లేదని పంటలకు ఎప్పుడు నీటి అవసరమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈఈ తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ లు ముని వేణు,విజయరామిరెడ్డి,ఏఈలు తిరుమలయ్య,గణేష్ బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement