తన సొంత బ్యానర్ పై విశ్వ నటుడు కమల్ హాసన్ నిర్మించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. కమల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇక్కడి సినిమాల మాదిరిగానే ఆదరిస్తారు. కమల్ ను ఒక పరభాషా నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అనుకోలేదు. అందువలన ఆయన సినిమాలు ఇక్కడ భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. అలాగే తమిళంతో పాటు తెలుగులోను ‘విక్రమ్’ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ స్థాయి రేటుకు ఈ సినిమా కొనుగోలు జరగడానికి కారణం కమల్ కి గల క్రేజ్ తో పాటు, దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ కూడా తోడవ్వటంతో భారీగా అమ్ముడుపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..