విశ్వనటుడు కమల్ హాసన్ కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న తక్షణమే ప్రముఖ టీవీ షోలో పాల్గొన్న కమల్ హాసన్ తీరుపై మండిపడింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం జాతీయ విపత్తుల చట్టం ప్రకారం కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది. నటుడు కమల్ హాసన్ నవంబర్ 22 వ తేదీన కరోనా మహమ్మారి భారీన పడ్డారు. దీంతో కమల్ హాసన్ ను చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో కరోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ఆయను కుటుంబ సభ్యులు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన కమల్ హాసన్ …. రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే టివీ షోలో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement