Sunday, November 24, 2024

జార్ఖండ్ సీఎం ఇంట్లో 15మందికి క‌రోనా

ప్ర‌పంచం అంత‌టా క‌రోనా పేరు మారుమ్రోగిపోతోంది. రోజు రోజుకి విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. పేద‌,ధ‌నిక అనే బేధ‌మే లేదు. అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. సీఎం భార్య‌తో స‌హా పిల్ల‌లు, ఇంట్లో ప‌నిచేసే మొత్తం సిబ్బంది 15మందికి కోవిడ్ పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. అయితే సీఎం హేమంత్ సోరెన్ కి మాత్రం నెగిటీవ్ గా వ‌చ్చింది. ఈ మేర‌కు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 62 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 24 మంది రిపోర్టులు వస్తే వాటిలో 15 మందికి పాజిటివ్ గా తేలింది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్.. ఆయన ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ముకూ కూడా కరోనా సోకింది. అయితే కరోనా సోకినవారందరికీ కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా కూడా కరోనా బారిన పడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement