ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజు సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తోంది. 2021 సంవత్సరానికి గానూ పెన్నా శివరామకృష్ణను ఎంపిక చేసింది ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. ఆయన స్మారకంగా ఈ పురస్కారాన్ని అందిస్తోంది.