Tuesday, July 2, 2024

Kalki Movie Review – ప్రభాస్, బిగ్ బి, కమల్ హాసన్ ల మ్యాజిక్ … ప్రపంచమంతటా హిట్ టాక్

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. కల్కి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలు ఒకరు ఇద్దరు కాదు.. చాలామంది హీరోలను మనం చూడొచ్చు. ప్రభాస్ కెరీర్‌లో కల్కి 2898 ఏడీ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఏకంగా 600 కోట్లు బడ్జెట్‌‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇవాళ విడుదలైన కల్కిసినిమా ఎలా ఉంది? సినిమా హిట్ అయినట్లేనా; అభిమానులు ఏమంటున్నారు? ఇక్కడ తెలుసుకుందాం.

కల్కి కథ ఏంటి?

ఇది భారతీయ పౌరాణిక నేపథ్యం , సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో నిర్మించారు. కాశీ, కాంప్లెక్స్, శంభాల అనే మూడు లోకాల చుట్టూ తిరిగే కథ ఇది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికొస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు. ఇందులో మొదటిది ‘కాంప్లెక్స్’.. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి.. ఇక్కడే సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి, నిర్జీవమైన దశలో ‘కాశీ’ పట్టణాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం ‘శంబల’. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహా యోధుడు (కల్కి) వస్తాడని వీళ్లంతా నమ్మకంతో ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచీ అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఎదురుచూస్తూ ఉంటాడు.

- Advertisement -

మరోవైపు అన్నీ వనరులు ఉండే కాంప్లెక్స్‌లో సెటిల్ అయిపోవాలని భైరవ (ప్రభాస్) ప్రయత్నాలు చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి (దీపిక పదుకొణె) కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్‌ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ అనుకుంటాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో భైరవ- అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగతుంది. మరి ఈ వీళ్లిద్దరిలో ఎవరు గెలిచారు? భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి? అసలు కల్కి ఎవరు? అ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే.. తప్పకుండా కల్కి సినిమా తెలుసుకోవాల్సిందే.

ఎవరు ఎలా నటించారు?
ఈ సినిమాలో బిగ్ బీ, కమల్ హాసన్ నటన అందర్నీ ఆకట్టుకుంది. అశ్వత్థామగా అమితాబ్ నటను అమోఘం. ఇక ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ కూడా తనదైన శైలిలో మెప్పించారు. ఇక ప్రభాస్‌ను పెంచే తండ్రి క్యారెక్టర్‌లో దుల్కర్ సల్మాన్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ.. అర్జనుడి పాత్రలో కనిపిస్తాడు. ఇక దీపిక పదుకొణె తన క్యారెక్టర్‌కు న్యాయం చేసింది. తన కడుపులో బిడ్డను మోసే కన్నతల్లిగా.. దీపికా బాగా నటించింది.

భారీ తారాగణంతో..

కల్కి మూవీలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరికొందరు స్టార్ హీరోలు, నటులు నటించడం.. పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు..తమదైన శైలిలో నటించారు. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సత్తా. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారిగా బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకలకి సరికొత్త అనుభూతిని అందించారు… డైరెక్టర్ నాగ్ అశ్విన్ . అయితే ఆయన ఎంతో కష్టపడి చేసిన ఈ భారీ ప్రయత్నమం చివరకు సక్సెస్‌ను అందించింది. ఇంత పెద్ద సినిమా అయినా.. ఆ రేంజ్‌లో ఎక్కడా పెద్దగా ప్రమోషన్లు, ఈవెంట్లు నిర్వహించకపోవడంతో.. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్.. కల్కి చుట్టూ కంటిన్యూ అయ్యింది. ‘వైజయంతీ మూవీస్‌’ ద్వారా అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తం మీద కల్కి ఓ అద్భుత సినిమా. ఈ కాలం యూత్‌ను ఆకట్టుకునే అమేజింగ్ మూవీ. చిన్నపిల్లలతో కలిసి కుటుంబం మొత్తం చూడగలిగే చిత్రం. ఎక్కడ వల్గరిటీ లేకుండా నిర్మించిన నాగ్ అశ్విన్‌కు హ్యాట్సాఫ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement