Friday, November 22, 2024

కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్ లో 42మందికి క‌రోనా – ఐసోలేష‌న్ లో చికిత్స‌

క‌రోనా బీభ‌త్స‌ధాటికి సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు వైద్యులు కూడా అల్లాడిపోతున్నారు. కాగా వ‌రంగ‌ల్ జిల్లాలోని కాక‌తీయ మెడికల్ కాలేజ్ లో క‌రోనా పాజిటీవ్ కేసులు 42కి చేరాయి. దాంతో విద్యార్థులు, ప్రొఫెస‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక్క‌డ చ‌దువుకుంటోన్న మ‌రో ఐదుగురు మెడికోల‌కు ఆర్ టీపీసీ ఆర్ ప‌రీక్ష‌ల్లో పాజిటీవ్ గా తేలింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు 25మంది మెడికోల‌కు క‌రోనా సోకింది. ఈ మేర‌కు ఎంజీఎం ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ బ‌త్తుల శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మోహ‌న్ దాస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పాజిటివ్ గా నిర్థారణ అయిన మేడికోలను ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్ఐటీ విద్యార్థులు కొందరు ఇళ్లకు వెళ్లివచ్చారు.

అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్యాంపస్ అధికారులు అనుమానంతో టెస్టులు చేయించగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో క్యాంపస్ లోని మిగతా స్టూడెంట్స్ కు కూడా కరోనా టెస్టులు చేయగా మొత్తం 16మందికి పాజిటివ్ గా తేలింది. ఇలా క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 16వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా నిర్దారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని… అందరు విద్యార్థులు ఆరోగ్యంగానే వున్నారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement