మే 6న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని ..ఓటు బ్యాంక్ లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతిచ్చారని తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ . రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే సీఎం కేసీఆర్ భయపడి అనుమతి ఇవ్వకుండా ఆపుతున్నారన్నారు. తనకు అనుమతి ఇవ్వవద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను బెదిరించారని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. అప్పుల సర్కార్ చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతానని చెప్పారు.తానెవరో తెలియదంటూ కమిషనర్ అన్నారని, గూగుల్ లో నా పేరు వెతికితే తెలుస్తుందని విమర్శించారు. సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదని, సభకు అనుమతివ్వలేదని, అయినంతమాత్రాన ఆగుతానా? అని ప్రశ్నించారు. నన్నెవరూ ఆపలేరని, ఎలా ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement