Friday, November 22, 2024

Just Asking: డియ‌ర్ ప్రైమ్ మినిష్ట‌ర్ గారు.. ఆ రైతుల బాధ్య‌త మీది కాదా?: ప్ర‌కాశ్ రాజ్‌

దేశ ప్ర‌ధానికి ఓ ప్ర‌శ్న సూటిగా వేశారు సినీ న‌టుడు, సామాజిక వేత్త‌ ప్ర‌కాశ్‌రాజ్‌. దేశ రైతుల బాధ్య‌త మీది కాదా.. ఢిల్లీలో అమ‌రులైన వారి కుటుంబాల బాధ్య‌త మీరు తీసుకోరా అని ప్ర‌శ్నించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమం చేసి అమరులైన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంద‌ర్భాన్ని గుర్తు చేశారు.

అంతేకాకుండా అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన సినీ ప్రముఖులు ప్రశంసల వ‌ర్షం కురిపిస్తున్నారు. సమంత, ప్రకాశ్‌ రాజ్‌, నాని, రామ్‌, రానా సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాల బాగుందని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోంది” అంటూ రామ్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ కేసీఆర్ నిర్ణయంపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రియమైన ప్రధాన మంత్రి గారు క్షమాపణలు ఒక్కటే సరిపోవు, ఆ రైతుల కుటుంబ బాధ్యత మీరు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement