Tuesday, November 26, 2024

Fake IT Raids: బంగారంతో జంప్.. మ‌హారాష్ట్ర‌లో నిందితుల అరెస్ట్

ఐటీ అధికారుల ముసుగులో సికింద్రాబాద్ లో చోరీకి పాల్పడిన నలుగురిని మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ లోని పాట్‌ మార్కెట్‌ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనలో చోరీకి పాల్పడిన నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన అనంతరం నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం.

గత శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ గోల్డ్‌ షాప్‌లో ఐదుగురు అగంతుకులు ఐటీ అధికారులమంటూ చొరబడి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన ఘటన సంచలనం రేకెత్తిన విషయం తెలిసిందే. ఇంటిదొంగల సహకారంతోనే బంగారం దోచుకెళ్లి ఉండొచ్చనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement