గులాబీ పువ్వుని ఇష్టపడని వారు ఎవరు చెప్పండి..ఈ గులాబీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే గులాబీల ధరల ఎంత ఉంటుందో అందరికి తెలుసు. కానీ ఈ గులాబీ ధర వింటే షాక్ అవాల్సిందే. ఏకంగా కోట్ల రూపాయలు పలుకుంది ఈ గులాబీ పువ్వు.దీనికో పేరు కూడా ఉందండోయ్..జూలియెట్ అనే గులాబీ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది. దీని ధర రూ. 130 కోట్లు పలుకుతుంది. జూలియెట్ గులాబీ పువ్వు వికసించేందుకు 15 సంవత్సరాలు సమయం పడుతుందట. ఈ గులాబీని అనేక పువ్వులను కలిపి.. డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి.. సృష్టించాడు. 2006లో మెుదటిసారిగా జూలియెట్ గులాబీని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పుడు 90 కోట్ల రూపాయలకు దీనిని విక్రయించారు. జూలియెట్‌న ధరకు మరొక కారణం కూడా ఉంది. ఈ పువ్వు నుంచి వచ్చే వాసన అమోఘం.. కొత్తరకమైన పెర్ఫ్యూమ్ సువాసనలా ఉంటుంది. చాలా మంది ఈ సువాసనను ఆకర్షితులవుతారు.. అంత బాగుంటదట..రోమియో, జూలియెట్ ప్రేమకథ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అందుకే ఈ గులాబీకి జూలియెట్ అనే పేరు పెట్టారట… జూలియెట్ గులాబీ ధర ఏడాదికోసారి పెరుగుతూనే ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజమండీ.
Advertisement
తాజా వార్తలు
Advertisement