Thursday, November 21, 2024

న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం: కేంద్ర మంత్రి రిజిజు

న్యాయవ్యవస్థ, శాసనమండలి, కార్యనిర్వాహక వ్యవస్థ అనే ఈ మూడు సమన్వయంతో పనిచేస్తే ఎంతో మెరుగైన అభివృద్ధి సాధించగలమని కేంద్ర న్యాయమంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన.

అయితే.. టీమ్ వర్క్ లేకుండా ఏదీ సాధించలేమని కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు చాలా స్పష్టంగా పనిచేస్తాయని చాలా మంది అనుకుంటారు. ఈ మూడు మానవ శరీరంలోని అవయవాలు అనుకుంటే.. వాటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని… అయితే సున్నితత్వం, అపార్థం కారణంగా కొంతవరకు అవి విడివిడిగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుందని రిజిజు చెప్పారు. ఒక్కోసారి ఈ మూడు అవయవాలు కూడా ఒకరి సమస్యలను మరొకరు విస్మరించడానికి ప్రయత్నిస్తాయని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం, అధికారం కోసం పోరాడుతున్న ఎవరైనా రాజ్యాంగ పదవిని ఆక్రమించడంలో తప్పు లేదు. కొన్నిసార్లు మీరు కంచెకు అవతలి వైపున ఉన్న కథను అర్థం చేసుకోవాలి అని రిజిజు చెప్పారు. భారత న్యాయవ్యవస్థ ఎంత విశిష్టమైనదో.. భారత కార్యనిర్వాహక న్యాయవ్యవస్థ, శాసనసభ ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి సమస్యలను ఏ దేశం ఎదుర్కోలేదని రిజిజు నొక్కిచెప్పారు.

స్వీపింగ్ కామెంట్స్ పాస్ చేయడం అనేది ఎవరికైనా చాలా ఈజీగానే ఉంటుంది. లెజిస్లేచర్ ఇలా చేయాలి, ఎగ్జిక్యూటివ్ అలా చేయాలి.. న్యాయవ్యవస్థ అన్ని (కేసుల) పెండెన్సీని క్లియర్ చేయాలి.. అని చెప్పడం చాలా సులభం. అయితే.. ఇది మాటల్లో అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. దీనిపై పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుందని ఎప్పుడూ భావిస్తుంటాను. అయితే.. అంతా కలిసి పనిచేయకుండా,  ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే మనం ఎప్పటికీ దేశంలోని సమస్యలను ఎదుర్కోలేము”అని రిజిజు చెప్పారు. ఈ క్రమంలో తనకు లక్ష్మణ రేఖ గురించి బాగా తెలుసునని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement