Thursday, November 7, 2024

Exclusive | మరింత పారదర్శకంగా కొలీజియం.. టాప్​–50 జడ్జిల లిస్టు రెడీ చేస్తున్నాం: సీజేఐ డీవై చంద్రచూడ్​

ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ కాదని, ప్రస్తుత వ్యవస్థలో మన మార్గంలో పనిచేయడమే పరిష్కారమని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. కొలీజియం వ్యవస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరింత పారదర్శకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఇవ్వాల (శుక్రవారం) వెల్లడించారు.  

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని సీజేఐ డివై చంద్రచూడ్ అన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకానికి ఆబ్జెక్టివ్ పారామీటర్‌ని నిర్దేశిస్తామని ఆయన తెలిపారు. నియామకాలకు అర్హులైన దేశంలోని అత్యున్నత న్యాయమూర్తులను అంచనా వేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని.. దీనికి పరిశోధన కోసం కేంద్రం విస్తృత వేదికపై పని చేయడం ప్రారంభించిందని సీజేఐ తెలిపారు. న్యాయమూర్తులపై అందుబాటులో ఉన్న డేటా, వారు వెలువరించే తీర్పుల ఆధారంగా మదింపు జరుగుతుందని తెలిపారు.

హైకోర్టులు, సుప్రీం కోర్టుకు నియామకాల కోసం ఆబ్జెక్టివ్ ప్రమాణాలతో ఒక పత్రాన్ని తయారుచేస్తామని, దేశంలోని టాప్ 50 మంది న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానంలో నియమించడానికి అంచనా వేస్తామని సీజేఐ డివై చంద్రచూడ్ అన్నారు. సుప్రీం కోర్ట్ కొలీజియం “క్లోజ్​డ్​ డోర్​ సిస్టం”గా విమర్శలను ఎదుర్కొంది. మూడు దశాబ్దాల నాటి కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా, జవాబుదారీగా లేదనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ అసమర్థంగా ఉందని మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement