Friday, November 22, 2024

‘మా’లో సీసీ ఫుటేజ్ వివాదం.. సీన్ లోకి పోలీసులు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ముగిసినా.. ఇరు ప్యానెల్ల మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతోంది. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేశారు.

‘మా’ ఎలక్షన్ రోజున నటుడు మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయని, తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరారు. అయితే, ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం కొనసాగుతోంది. అయితే, ఈ వివాదంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ను సీజ్ చేశారు. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్… ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు పోలీసులు తాళం వేశారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement