తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్నారని నడ్డాకు బండి సంజయ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. వెంటనే స్పందించిన జేపీ నడ్డా.. ”సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్…. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు. మేం చూసుకుంటాం… న్యాయ స్థానంలో మేం పోరాడతాం. జాతీయ నాయకత్వం యావత్తు సంజయ్ జీ వెంట ఉంది. గో…హెడ్” అని భరోసా ఇచ్చారు.
కాగా, ఆదివారం(జనవరి 2) ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేసిన ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు స్వల్ప గాయమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital