– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వన్యప్రాణులను వాటి ఆవాసా ప్రాంతాలకు వెళ్లి చూడాలంటే కచ్చితంగా జంగిల్ సఫారీ చేయాల్సిందే. ఇట్లాంటి గొప్ప అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా ఎక్కువ దూరం జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. త్వరలోనే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రారంభం కానుంది. కోరుకున్న ప్రకృతిని, వన్యప్రాణుల చూసి సంతోష పడే అవకాశం దక్కనుంది.
హైదరాబాద్ నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన టైగర్ రిజర్వ్ ఉంది. ఇది ఫారెస్ట్ అందాలతో మునిగి తేలడంతోపాటు.. వన్యప్రాణుల సహజ ఆవాసాల్లో ఉన్న పలు రకాల జంతువులు, గంభీరమైన పులులను చూసేందుకు ఒక బెస్ట్ ప్లేస్‌గా మారనుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 2,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో ‘నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌గా పిలువబడే ఈ పర్యావరణ-పర్యాటక ప్రదేశాన్ని నిజాం రాజులు ఎక్కువగా ఉపయోగించారు. వారు పులులను గుర్తించడానికి.. అటవీ జంతువులను వేటాడేందుకు అడవిలోని ఈ ఏరియాల్లో సందర్శించేవారు. కాబట్టి, ఈ టైగర్ రిజర్వ్ చరిత్ర పర్యావరణ ప్రేమికులకు కూడా సరైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.
జంగిల్ సఫారి సమయాలు .. ఖర్చు వివరాలు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రిజర్వ్ సఫారీలను నిర్వహించనుంది. ఇది ఓపెన్ జీప్‌లో సుందరమైన అటవీ టూరిజాన్ని చూసేందుకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అడవిలోని ఈ భాగంలో 28 కంటే ఎక్కువ పులులు, చిరుతలు, జింకలు ఉన్నాయి. ఇక ఈ సఫారీలో వ్యూపాయింట్ వంటివి కూడా ఎంతో అద్భుత ప్రదేశంగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి వందల ఎకరాల అడవిని చూడొచ్చు.
ఇక.. ప్రయాణం కూడా చాలా తేలికగా ఉంటుంది. సఫారీని కేవలం ఒక్కొక్కరికి 200 రూపాయలు మాత్రమే చార్జ్ చేయనున్నారు. టైగర్ రిజర్వ్ లో జంతువులను చూడ్డానికి ఉదయం 7 నుంచి -9 లేదా, సాయంత్రం 4 నుంచి -6 గంటల మధ్య వెళ్లాల్సి ఉంటుంది.
మీలో ఉన్న సాహస ప్రియులను శాంతింపజేయాలనుకుంటే.. ఒంటరిగా లేదా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు విహారయాత్ర చేయొచ్చు. ఈ జంగిల్ సఫారీ ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది. పచ్చదనంతో కూడిన అటవీ అందాలను చూస్తూనే.. అద్భుతమైన జీవులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.