Tuesday, November 26, 2024

జ‌ర్న‌లిస్టుల‌కు అవార్డులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఐఐఎంసీ హెడ్ క్వార్ట‌ర్స్ లో కూ క‌నెక్ష‌న్ వేదిక‌పై అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ అవార్డులను రిపోర్టింగ్, అడ్వర్టయిజింగ్, పీఆర్, కమ్యూనికేషన్స్ వంటి ఎనిమిది విభాగాల్లో విజేతలను వెల్లడించింది. ప్రముఖ జర్నలిస్టు చిత్ర సుబ్రమణియం దువెల్ల, మధుకర్ ఉపాధ్యాయ్, ప్రసిద్ధ భరత నాట్యం డ్యాన్సర్ పద్మశ్రీ గీతా చంద్రన్‌, రాహుల్ శర్మ, పార్థ ఘోష్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా, సౌరభ్ ద్వివేదిని అల్యూమ్నీ ఆఫ్ ఇయర్‌గా డిక్లేర్ చేశారు. కాగా, శ్రిష్టి జైస్వాల్ అత్యధిక ప్రైజ్ మనీ గల అవార్డును గెలుచుకున్నారు. అగ్రికల్చర్ రిపోర్టింగ్ విభాగంలో శ్రిష్టి జైస్వాల్ రూ. 1 లక్ష బహుమతిని సొంతం చేసుకున్నారు. కాగా, మిగితా జర్నలిస్టులు అంతా రూ. 50 వేల క్యాష్ ప్రైజు గెలుచుకున్నారు. జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌ (పబ్లిషింగ్)గా క్రిష్ణ ఎన్ దాస్, జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌ (బ్రాడ్‌క్యాస్టింగ్)గా అజతికా సింగ్‌లు ఈ అవార్డులను గెలుచుకున్నారు. కాగా, పబ్లిషింగ్ కేటగిరీలో ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్టర్‌గా ఎటికాల భవాని, అదే బ్రాడ్‌క్యాస్టింగ్ కేటగిరీలో జ్యోతిస్మిత నాయక్ గెలుచుకున్నారు.

ప్రొడ్యూస్ ఆఫ్ ది ఇయర్ విన్నర్‌గా కౌశల్ లఖోటియా, ఏడీ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా విపిన్ ధ్యాని, పీఆర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ముని శంకర్ పాండేలు విన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో 1971-72 గోల్డెన్ జూబిలీ అల్యూమ్నీ బ్యాచ్, 1996-97 సిల్వర్ జూబిలీ అల్యూమ్నీ బ్యాచ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఐసీఎం డీజీ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది మాట్లాడారు. ఐఐసీఎం విద్యార్థులు లేనిది భారత జర్నలిజం చరిత్ర అసంపూర్ణంగానే ఉంటుందని అన్నారు. ఐఐఎంసీ విద్యార్థులు అంతర్జాతీయ గుర్తింపు పొందారని, తద్వారా వారు చదువుకున్న సంస్థను గర్వపరిచారని వివరించారు. ఈ కార్యక్రమానికి ఐఐసీఎంఏఏ ప్రెసిడెంట్ కళ్యాణ్ రంజన్ అధ్యక్షత వహించారు. కాగా, రాజేందర్ కటారియా, బ్రజేష్ కుమార్ సింగ్, సముద్ర గుప్తా కశ్యప్, సిమ్రత్ గులాటి, నితిన్ మంత్రి, నితిన్ ప్రధాన్, సుప్రియ ప్రసాద్, కిట్టీ ముఖర్జీ, సాధనా ఆర్య, బ్రదినాథ్‌లు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement