సాహిత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రచయిత అనిల్ ధార్కర్ కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న 74 ఏళ్ల ధార్కర్ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన జర్నలిస్టుగా సేవలు అందించారు. కాలమిస్టుగా, ఎడిటర్‌గా, టీవీ షో వ్యాఖ్యాతగా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహాల కమిటీ సభ్యుడిగానూ ఆయన పనిచేశారు. ధార్కర్ మృతిపై పలువురు జర్నలిస్టు ప్రముఖులు, ఇతర ముఖ్యలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పత్రికారంగంతో పాటు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్. ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కరియర్లో కాలమిస్ట్‌గా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహా కమిటీ సభ్యుడిగా ఇలా అనేక బాధ్యతల్లో పనిచేశారు. మిడ్-డే, ది ఇండిపెండెంట్‌తో సహా పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆకాశవాణి ఆడిటోరియంను ఆర్ట్ మూవీ థియేటర్‌గా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.