గూగుల్‌ను జోక్ వైరస్ ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ వైరస్ ఎప్పట్నుంచో యాప్స్‌ను అటాక్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో 8 యాప్స్‌లో ఈ వైరస్ కనిపించింది. ఈ ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్సే. గూగుల్ ప్లేస్టోర్‌లో కూడా ఈ యాప్స్ ఉండేవి. ఆండ్రాయిడ్ డివైసెస్‌ను మాత్రమే ఈ జోకర్ వైరస్ టార్గెట్ చేస్తుంది. కొన్ని నెలలకు ఒకసారి ఈ వైరస్ తన కోడ్‌ను, ఎటాక్ చేసే పద్ధతులను మార్చుకుంటూ వస్తోంది. ఈ విషయాన్ని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు.
దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫ్రిమ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ జోకర్ వైరస్ మాల్వేర్ ఉన్న ఎనిమిది యాప్‌లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్ఇన్స్టాల్ చేయమని సూచించింది.
ఈ జోకర్ యాప్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తుంది. ఎస్ఎంఎస్, కాంటాక్ట్ లిస్ట్, డివైస్ ఇన్ఫో, ఓటీపీలను కూడా ఇందులో అందించనున్నారు. గూగుల్ ఈ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించాయి. కానీ వీటిని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీరే అన్ఇన్స్టాల్ చేయవచ్చు. మీరు డిలీట్ చేయాల్సి 8 యాప్స్ ఇవే..
1. Auxiliary Message (యాక్సిలరీ మెసేజ్)
2. Fast Magic SMS (ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎంఎస్)
3. Free CamScanner (ఫ్రీ క్యామ్‌స్కానర్)
4. Super Message (సూపర్ మెసేజ్)
5. Element Scanner (ఎలిమెంట్ స్కానర్)
6. Go Messages (గో మెసేజెస్)
7. Travel Wallpapers (ట్రావెల్ వాల్ పేపర్స్) 8. Super SMS (సూపర్ ఎస్ఎంఎస్)