తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుండి మిలియన్ డాలర్లని సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వనున్నారట హాలీవుడ్ నటుడు జానీడెప్. అంబర్ హెర్డ్, జానీ డెప్ ఒకరిపై ఒకరు న్యాయపోరాటానికి దిగడం తెలిసిందే. జానీ డెప్ డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావానికి గురైన సమయంలో తనను శారీరకంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. హెర్డ్ కు వ్యతిరేకంగా జానీ డెప్ 50 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశాడు. ఇద్దరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వెలువరించింది. డెప్ కు 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని హెర్డ్ ను ఆదేశించగా, హెర్డ్ కు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని జానీ డెప్ నకు కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ఎనిమిది కోట్లని ఐదు స్వచ్ఛంద సంస్థలకి విరాళంగా ఇవ్వనున్నారు కోర్టులో హెర్డ్ పై డెప్ విజయం సాధించడం తెలిసిందే. కాగా ఒక్కో చారిటీకి 2 లక్షల డాలర్ల చొప్పున పంచనున్నాడు. అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇలా ఐదు సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని వెచ్చించనున్నాడు. మేక్ ఏ ఫిల్మ్ ఫౌండేషన్, ద పెయింటెడ్ టర్టిల్, రెడ్ ఫెదర్, మార్లన్ బ్రాండోస్ కు చెందిన టెటిరో సొసైటీ చారిటీ, అమెజానియా ఫండ్ అలియన్స్ ను జానీ డెప్ ఎంపిక చేసుకున్నాడు. ఈ ఐదు సంస్థలకు 2 లక్షల డాలర్ల చొప్పున ఇవ్వనున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే దర్శకులు, రచయితలు, నిర్మాతలు, వారి పిల్లలకు కూడా ఈ విరాళం అందనుంది.