ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ఒక తరంలో అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభంగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
గత నెల రోజులు రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిపై చర్చించేందుకు నాటో దేశాల నేతలు ఇవాళ బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్ లో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర నాటో దేశాల అధినేతలు ఈ భేటీ అయ్యారు. రష్యాపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చర్చలకు ముందు, స్టోల్టెన్‌బర్గ్ నాయకులు ఈ సంక్షోభాన్ని కలిసి పరిష్కరిస్తారని ప్రకటించారు. కాగా జోబైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై తిరిగి పోటీ చేసే అవకాశం వస్తే.. చాలా సంతోషిస్తాననీ అన్నారు. ఒకవేళ.. డొనాల్డ్ ట్రంప్ పై మళ్లీ పోటీ చేయాల్సి న అవకాశం వస్తే.. తాను చాలా అదృష్టవంతుడిని బ్రస్సెల్స్‌లో NATO, G7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన బిడెన్ విలేకరులతో అన్నారు.
బైడెన్ రెండవసారి తన అవకాశాల గురించి చాలా అరుదుగా మాట్లాడతారు. అస్సలు ట్రంప్ పోటీ చేయరని ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రధాన పోటీ దారుడుగా ఉంటే.. బైడెన్ గెలుపు సులభమేనని చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ పై పలు ఆరోపణలున్నాయి. ట్రంప్ కేవలం ఒక పర్యాయం.. అధ్యక్షుడుగా చేసి.. 2020 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. కానీ, తానే గెలిచాననీ, తనను ఓడినట్టు ప్రకటన చేస్తున్నారని ఆ సమయంలో సంచలన ప్రకటన చేశారు. తాను వైట్‌హౌస్‌కు తిరిగి రావాలనుకుంటున్నానని ప్రకటించారు. తనను ఎన్నికల్లో కావాలనే..ఓడించారని, పోలింగ్ సరిగా నిర్వహిలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.