భారత్ పై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై మాట్లాడేందుకు భారత్ కు వణుకుతోందని అన్నారు. అమెరికా మిత్రదేశాల్లో భారత్ మాత్రమే భయపడుతోందని చెప్పారు. జాపాన్, ఆస్ట్రేలియా సైతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరును ఖండించాయని తెలిపారు. క్వాడ్ దేశాలు పుతిన్ ను ఒంటరి చేయడంలో విజయవంతం అయ్యాయని చెప్పారు. రష్యా దండయాత్రను వ్యతిరేకించే విషయంలో నాటో, పసిఫిక్‌లోని దేశాలు ఐక్యంగా ఉన్నాయని అన్నారు.
కాగా, క్వాడ్ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయగా.. భారత్ మాత్రం ఆ దేశం నుంచి కొనుగోలు మాత్రం కొనసాగిస్తోంది. అలాగే, ఐక్యరాజ్యసమితిలో మాస్కో చర్యలను ఖండిస్తూ ప్రవేశపెట్టి తీర్మానంలో చేరడానికి నిరాకరించింది. ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై బైడెన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకిస్తున్న నాటో, యూరోపియన్ యూనియన్, కీలక ఆసియా భాగస్వాములతో సహా అమె నేతృత్వంలోని కూటమిపై ఈ సందర్భంగా బైడెన్ ప్రశంసలు కురిపించారు.