ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే (indian railway)లో భాగమైన సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway) ఖాళీగా ఉన్న గూడ్స్గార్డ్ (Goods guard) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ (railway recruitment) బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు కోల్కతా కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcser.co.in/ వెబ్సైట్ చూడవచ్చు.
మొత్తం ఖాళీ పోస్టులు: 520 వీటిలో జనరల్- 277, ఓబీసీ- 87, ఎస్సి- 126, ఎస్టి- 30 కేటాయించారు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.
వయసు: అభ్యర్థుల వయసు 42 ఏళ్ల లోపువారై ఉండాలి(ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.