కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ఈనెల 17వ తేదీన సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు బోగీలు, ఇంజిన్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. కాగా, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో దామెర రాకేష్ చనిపోయాడు. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మృతుడి కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు ప్రకటించారు..
ఇక.. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రాకేష్ అన్న దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవ్వాల (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన జాబ్ ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.