Friday, November 22, 2024

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీలో నిరుద్యోగుల కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు జాబ్ క్యాలెండర్‌ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశాలు జారీచేశారు. మే 31వ తేదీలోపు ఎన్ని పోస్ట్‌లు ఉన్నాయో లెక్కగట్టి నివేదిక తయారుచేస్తే.. మే 31వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీల్లో ఖాళీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో లెక్క తేల్చి సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు, అధికారాలను వాటికి బదిలీ చేయనుండగా.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలన చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఆన్‌లైన్‌లో నేరుగా చూసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement