ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవలే జియో టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తోంది. అయితే, తాజా రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement