ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్లని తీసుకొస్తోంది. ఈ మధ్య కాలంలో జియో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో చాలామంది ఆ నెట్‌వర్క్ నుంచి దూరం అవుతున్నట్టు ట్రాయ్ వెల్లడిస్తున్న లెక్కలు చెబుతున్నాయి. అయితే ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్తవారిని ఆకర్షించేందుకు జియో ఇప్పుడు ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అతి తక్కువ ధరలతో దేశంలో 4G సేవలను ప్రారంభించిన ఈ సంస్థ కొద్దికాలంలోనే ఎంతో మంది కస్టమర్ల ఆదరణ పొందింది. దేశంలోనే నెంబర్ వన్ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్‌గా అవతరించింది. కస్టమర్లను సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ తో ఆకట్టుకోవడం వల్లే ఇది అగ్రస్థానంలో కొనసాగుతుంది.
అతి తక్కువ ధరలకే ఎక్కువ ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియోలోని రూ.395 రీఛార్జ్ ప్లాన్ తో ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. జియో వాల్యూ ప్యాక్’ పేరుతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ ను రూ.395తో ప్రవేశపెట్టారు. ఇంట్లో వైఫై ఉన్న వాళ్లకైతే ఇది బాగా పనిచేస్తుంది. లేకుంటే అడిషనల్ నెంబర్‌గా జియో వాడుతున్న వారికి కూడా ఇది బాగా ఉపయోగంగా ఉటుంది. ఎందుకంటే ఈ ప్లాన్ ప్రకారం.. డేటా తగ్గించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఈ ప్లాన్ లో రోజువారీ డేట్ సౌకర్యం లేదు. ఎక్కువగా ఇంటర్నెట్ కోసం వైఫై మీద ఆధారపడే వాళ్లు ఈ ప్లాన్ కు మొగ్గు చూపుతారు. రూ. 395 రీఛార్జ్ తో 3 నెలలు అంటే 84 రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో 6GB హైస్పీడ్ డేటాను పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 SMSలు, అపరిమిత కాలింగ్ సదుపాయం కల్పించారు.
రిలయన్స్ జియో రూ.1,499 రీఛార్జ్ ప్లాన్ రెండేళ్ల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్ సహా 24 GB హైస్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు. అంతేకాకుండా జియోకు సంబంధించిన అన్నీ యాప్స్ లో ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియోకు సంబంధించిన రూ.2,999 విలువైన స్మార్ట్ ఫోన్ కూడా పొందవచ్చు.