ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ(JEE) అడ్వాన్స్‌డ్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనుంది. ఈ మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు మాత్రం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 3న జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
హర్యానాలో జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు సీబీఐ తేల్చడంతో నిన్న సాయంత్రం విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ ఫలితాలను వాయిదా వేశారు. రేపు, లేదంటే ఎల్లుండి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల ఫలితాలను పక్కనపెట్టిన అనంతరం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించడం వల్లే జాప్యం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండిః సెల్ఫీ వీడియోః సీఎం సార్ న్యాయం చేయండి.. ఇక ఆత్మహత్యే దిక్కు..