బీహార్‌లో మద్యం మత్తులో అధికార జేడీయూకి చెందిన ఓ నేత నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బిహార్‌లో మద్య నిషేధం కోసం జేడీయూ అగ్రనేత, సీఎం నితీశ్ కుమార్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే, ఆయన పార్టీకి చెందిన నేతనే తాగి నగ్నంగా తిరగడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన సీఎం నితీశ్ సొంత జిల్లా నలందలో జరిగింది.
ఇస్లాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ ఇన్ ఛార్జి జై ప్రకాష్.. తన సోదరుడితో గొడవపడ్డాడు. ఇంటి బయట తన సోదరుడిని దుర్భాషలాడుతూ, తిడుతున్నట్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జై ప్రకాష్ ను అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో ఆయన శరీరంపై ఒక్క వస్త్రం కూడా లేదు. అరెస్టు చేసిన యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినట్లు ధృవీకరణ కావడంతో అతనిపై ఎక్సైజ్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. కాగా, జై ప్రకాష్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు జేడీయూ ఇప్పటికే ప్రకటించింది.