న్యూఢిల్లి:ఇటీవలి కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో బొక్క బోర్లా పడిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) వ్యూహం మార్చు తున్నట్లు కనిపిస్తోంది. మునుపటి మిత్రుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా 2024 ఎన్నికలకు విపక్ష కూటమి ప్రయత్నాల నుంచి దేవెగౌడ పార్టీ పక్కకు జరు గుతున్న సంకేతాలు ఇచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో పొత్తుకు సిద్ధమనే భావనను వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అగ్రనేతల వ్యాఖ్యలు, ప్రవర్తన ఇందుకు బలాన్నిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారాల తర్వాత బీజేపీ వైపు స్నేహ హస్తం చాస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది, అధికార బీజేపీని గద్దె దించి, కింగ్‌మే కర్‌గా నిలవాలన్న జేడీఎస్ ఆశలపైనా నీళ్లు చల్లింది. 2019 ఎన్నికల్లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మా త్రమే గెలుచుకున్న జేడీఎస్, ఇటీవలి అసెంబ్లి ఎన్నికల్లో మరింత చతికిలపడింది. తన ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఖాతా లో చేరినట్లు గుర్తించింది. నష్ట నివారణ చర్యల వ్యూహంలో భాగంగా ఇప్పుడు కాషాయపార్టీతో పొత్తుకు ఆసక్తి చూపు తున్నట్లు అర్దమవుతోంది. మొత్తం 224 సీట్లలో కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. మాజీ ప్రధాని ##హచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్, ఒకప్పటి మిత్రపక్షమైన బిజెపితో జతకడితే కాంగ్రెస్ ను ఓడించి తన ఓట్‌బేస్‌ను కాపాడుకునే అవకాశాన్ని అంచ నా వేస్తున్నట్లు సమాచారం.
మారుతున్న స్వరం..
ఒడిశాలో రైలు ప్రమాద ఘటనతో కేంద్ర రైల్వే మంత్రిని విపక్షాలు టార్గెట్ చేశాయి. అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయా లని డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో దేవెగౌడ మాత్రం వైష్ణవ్‌ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. ‘జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి రైల్వే మంత్రి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అతను అవి శ్రాంతంగా పనిచేస్తున్నాడు. విచారణ పూర్తి చేయనివ్వండి. మంత్రి తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ దశలో అతని ని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలివైన పని కాదు” అని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు విపక్షా లను షాక్‌కు గురిచేశాయి. కొత్త పార్లమెంట్ భవన ప్రారం భోత్సవాన్ని విపక్షాలు వ్యతిరేకించిన సమయంలోనూ దేవె గౌడ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. మోడీ ప్రభు త్వానికి మద్దతుగా నిలిచారు. మరోఅడుగు ముందుకేసి విపక్షాల కూటమి ప్రయత్నాలపైనా భిన్నంగా స్పందించారు. నేను ఈ దేశ రాజకీయాల గురించి వివరంగా విశ్లేషించ గలను. ఉపయోగం ఏమిటి? ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపితో సంబంధం లేని ఒక పార్టీని నాకు చూపించండి. అప్పుడు నేను సమాధానం ఇస్తాను అంటూ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
17 ఏళ్ల తర్వాత మళ్లి..
గతంలో దేవెగౌడ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేశారు. 20 నెలల అధికార భాగస్వామ్య ఫార్ములా ప్రకారం కుమార స్వామి ముఖ్యమంత్రిగా, బీజేపీ యెడియూరప్ప డిప్యూటీగా 2006లో కర్ణాటకలో ఈరెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ అధికారాన్ని బీజేపీకి బదిలీ చేయ కపోవడంతో సంకీర్ణం విచ్ఛిన్నమైంది. ఆతర్వాత ఈ రెండు పార్టీలు ఎవరివారే అన్నట్లుగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు మళ్లిd రాజకీయ అవసరాల దృష్ట్యా స్నేహానికి సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.