దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అయితే శ్రీదేవి తర్వాత ఎవరు ఇష్టమంటే సహజనటి జయసుధ అని చెబుతుంటారాయన. ఓ సినిమా పోస్టర్ పై ఉన్న జయసుధను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట. ‘శివరంజని’ సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్ బాబుపై ద్వేషం కూడా పెంచుకున్నారట. ఆ తర్వాత జయసుధ, మోహన్ బాబులను పెట్టి 2014లో ఆయన ‘రౌడీ’ సినిమాను తీశారు. జయసుధతో ‘మనీ’, ‘మనీ మనీ’ సినిమాను కూడా నిర్మించారు. తాజాగా జయసుధను వర్మ ఆకాశానికెత్తేశారు. ‘దైవపుత్రుడు’ అనే క్రైస్తవ గీతాన్ని ఆమె పాడారు. ఈ గీతాన్ని ట్విట్టర్ లో వర్మ షేర్ చేశారు. ‘జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు’ అని ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement