Friday, November 22, 2024

జయలలిత 74వ జయంతి – నివాళులర్పించిన త‌మిళ‌నాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే హయాంలో మాదిరిగానే డీఎంకే హయాంలో జయలలిత విగ్రహానికి ప్రభుత్వం తరపున నివాళులు అర్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, చెన్నై ఉన్నత విద్యా మండలి మైదానంలో ఉన్న జయలలిత విగ్రహ నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్‌కు అప్పగించింది. జ‌య‌ల‌లిత‌ విజయవంతమైన నటి, ఆమె 1960ల మధ్యకాలంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. 1961, 1980 మధ్యకాలంలో దాదాపు 140 చిత్రాలలో న‌టించారామె. ఎక్కువగా తమిళం, తెలుగు, కన్నడ భాషలలో న‌టించారు. 1982లో, ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి ఏఐఏడీఎంకేలో చేరారు. చాలా సినిమాల్లో జయలలిత ఎంజీఆర్‌తో ప‌లు చిత్రాల్లో న‌టించారు. జయలలిత రాజకీయ జీవితం త్వరగా ప్రారంభమైంది. ఆమె ఏఐఏడీఎంకే ప్రచార కార్యదర్శి అయ్యారు . కొన్ని సంవత్సరాలలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement