మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల అయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పుల అనంతరం జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు బంధీంచిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కు అప్పగించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. ఇప్పటికే మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారని అడవుల్లో జరిగిన దాడికి సంబంధించి కేంద్ర బలగాలతో సమీక్ష జరిపినట్లు సమాచారం. అయితే ఆరురోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్న రాకేశ్వర్ ను విడుదల చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్ జిల్లా తారెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ కాల్పుల అనంతరం 23 మంది జవాన్లు నేలకొరగగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు తమ ఆధీనంలో బందీగా ఉంచారు. అయితే రాకేశ్వర్ సింగ్ కు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటు ఆయన కుటుంబం.. ఇటు చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం పలుమార్లు మావోయిస్టులకు విజ్నప్తులు చేస్తూ వచ్చాయి. రాకేశ్వర్ కు సురక్షితంగానే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ఓ ఫొటోను విడుదల చేసింది. మధ్యవర్తుల పేర్లు ప్రకటించి జవానుని విడిపించుకు వెళ్లాలని లేఖ విడుదల చేశారు. అయితే, తాజాగా ఆయన మవోయిస్టు చెర నుంచి విడుదల అయినట్లు ప్రచారం జరుగుతోంది.