జవాద్ తుఫానుతో ఏపీకి పెద్ద ముప్పు రానుంది. తీవ్ర వాయుగుండగా ఉన్నది నేడు తుఫానుగా మారడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఉత్తరాంధ్ర, ఒడిషాల మధ్య తుఫాను రేపు తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఒడిశాలోని 14 తీర ప్రాంత జిల్లాలను అలర్ట్గా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన తుఫాను నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 32 కిలోమీటర్ల దూరంలో తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది. రేపు ఉదయం దక్షిణ ఒడిషా.. ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా రానుంది. దీంతో ఒడిశా, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ.. సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చిరించారు.