Tuesday, November 26, 2024

సామాన్యుడిని పెళ్లాడిన రాజకుమారి.. రాచ‌రిక‌పు హోదాకు దూరం!

రాజుల ఇంట పెళ్లి అంటే.. ఆ వైభవమే వేరు. కానీ అంబరాన్నంటే సంబరాలేవీ లేకుండానే ఆ యువరాణి వివాహం జరిగింది. ఓ సామాన్యుడిని జ‌పాన్ యువ‌రాణి మాకో ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకుంది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత జపాన్‌ రాకుమారి మకో..తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ప్రేమ కోసం రాచ‌రిక‌పు హోదాను వదిలి ప్రియుడు కొమ‌రోను పెళ్లాడింది. టోక్యో ఇంపీరియల్​ ప్యాలెస్​లో మకో- కొమురోల వివాహం నిరాడంబరంగా జరిగింది.

జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తో అయిన మకో.. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకుంది. అక్కడే తనతో పాటు చదువుకునే సామాన్యుడు కొమురోను ఇష్టపడింది. కొమురోతో మాకోకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. కొమురోను వివాహం చేసుకుంటాన‌ని 2017లోనే మాకో ప్ర‌క‌టించింది. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డింది.

కాగా, జపాన్‌ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో.. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement