Saturday, November 23, 2024

భారత్‌లో జపాన్‌ పెట్టుబడులు, 3.2లక్షల కోట్లు.. ఐదేళ్లలో అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్‌

భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ సిద్ధమైంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఐదేళ్లలో వేరేరు రంగాల్లో 42 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు కూడా చేసినట్టు జపాన్‌ మీడియా తెలిపింది. జపాన్‌ ప్రధాని భారత్‌లో రెండు రోజుల పర్యటన శనివారం నుంచి ప్రారంభమైంది. టోక్యో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కిషిడ.. సాయంత్రం ఢిల్లిdకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఐటీ శాఖ మంత్రి అశినీ వైష్ణవ్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్‌-జపాన్‌ మధ్య వార్షిక ఉన్నత స్థాయి సమావేశం చివరి సారిగా 2018లో టోక్యోలో జరిగింది. ఆ తరువాత నాలుగేళ్ల విరామం తరువాత.. మళ్లిd ఈ సదస్సు ఏర్పాటైంది. ఈసారి ఈ సదస్సుకు ఢిల్లిd వేదికవ్వనుంది. కిషిడ పర్యటనలో భాగంగా.. భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ద్వైపాక్షిక చర్చలకు హాజరవుతారు. 14వ భారత్‌-జపాన్‌ వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొని కీలక ఒప్పందాలు చేసుకుంటారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి..

2014లో అప్పటి ప్రధాని షింజో అబే ప్రకటించిన 3.5 ట్రిలియన్‌ యెన్ల పెట్టుబడులకు ఇవి అదనమని జపాన్‌ మీడియా తెలిపింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, క్లీన్‌ ఎనర్జీ విభాగాల్లో భారత్‌ సహకారాన్ని కోరుతుందని తెలిపింది. భారత్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జపాన్‌ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి అవసరమైన అనుమతులను సింగిల్‌ విండో సిస్టమ్‌లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతారని జపాన్‌ మీడియా పేర్కొంది. భారత్‌లో పలు నగరాభివృద్ధి ప్రాజెక్టులను జపాన్‌.. అన్ని రకాలుగా తన సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికం, సాంకేతికపరంగా దోహదం చేస్తున్నది. హైస్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ టెక్నాలజీలోనూ కీలక పాత్రను పోషిస్తున్నది. భారత్‌-జపాన్‌ మధ్య అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలు ధృడంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని.. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు జపాన్‌ మీడియా వెల్లడించింది.

సుజుకీ ఈవీ రంగంలో 1.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి..

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకీ, భారత్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సెగ్మెంట్‌లో భారీ పెట్టుబడులు ప్రకటించనున్నట్టు పేర్కొంది. 150 బిలియన్‌ యెన్‌ల (1.3 బిలియన్‌ డాలర్లు) మేర ఈ పెట్టుబడులు ఉంటాయని అంచనా వేసింది. భారత్‌లో ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ ప్రొడక్షన్‌ను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టేలా భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్టు స్పష్టం చేసింది. 2025 నాటికి భారత్‌ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

రష్యా-ఉక్రెయిన్‌పై చర్చకు నో..

రెండు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం.. కిషిడా.. నేరుగా కంబోడియాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని హ్యున్‌సెన్‌తో సమావేశం అవుతారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన భారత్‌కు రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన అంశాలేవీ ఈ పర్యటనలో ఉండబోవని తెలుస్తున్నది. ఈ యుద్ధంలో జపాన్‌.. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. రష్యాపై ఆంక్షలను సైతం విధించింది. భారత్‌ మాత్రం తటస్థ వైఖరిని కనబరుస్తున్నది. రష్యాతో సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా తటస్థంగా ఉంటోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత అంతర్జాతీయ వేదిక మీద కూడా స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement