తెలంగాణలో ప్రారంభమయింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విదేశాల్లోనూ కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిగా గత నెలలో శ్రీలంకలో మొక్కలు నాటారు.. తాజాగా జపాన్‌లోనూ మొక్కలు నాటారు. రాజ్‌గ్రూప్, నిర్వానమ్ అండ్ నేహా ఎన్ టెక్నాలజీస్ సంస్థల ఆధ్యర్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జపాన్‌లో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కొహానా ఇంటర్నేషనల్ స్కూల్‌లో మూడు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటానని చెప్పడం విశేషం. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily