ఓ క్లీనిక్ లో అగ్నిప్రమాదం జరగడంతో 27మంది మృతి చెందారు. ఈ సంఘటన జపాన్ లోని ఒసాకా నగరంలో జరిగింది. జపనీస్ బ్రాడ్ కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై మార్కెట్ లోని ఎనిమిది అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కాగా ఈ భవనంలోని నాలుగవ అంతస్తులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 28మంది చిక్కుకున్నారు. అయితే మంటలకు భయపడి 27మందికి హార్టెటాక్ వచ్చి మరణించినట్టు వైద్యులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అరగంటలో భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయి. జపాన్‌లోని వాణిజ్య జిల్లాగా భావించే ఒసాకా నగరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది.
భవనం లోపల అత్యంత వేగంతో మంటలు వ్యాపించడంతో భారీ ప్రాణనష్టం జరిగిందని వివరించింది. డజన్ల కొద్దీ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించి అరగంటలో అదుపులోకి తీసుకువచ్చారని తెలిపింది. ప్రమాదం జరిగిన అంతస్తులో ఒక క్లినిక్ నడుపుతున్నారని, మానసిక సమస్యలతో పాటు సాధారణ వైద్య చికిత్సను ఇక్కడ అందజేస్తున్నట్టు తెలిపింది. మొత్తం 70 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..