బైకులంటే యువతకి ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్ లో కొత్త బైక్ వచ్చిందంటే చాలు లక్షలకు, లక్షలు పెట్టి మరీ కొంటుంటారు. ఖాళీ రోడ్లు కనిపిస్తే చాలా రైయ్,రైయ్ అంటూ దూసుకుపోతారు. అయితే, కొన్ని చోట్ల ట్రాఫిక్ చిక్కుల కారణంగా ఎంత ఖరీదైన బైక్ ఉన్నా.. దాని రైడ్ సంతృప్తి ఇవ్వదు. అంతే కాదు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో చాలా మంది బైకులంటేనే భయపడుతున్నారు. దీంతో ఎలక్టిక్ తో నడిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యల కారణంగా మోట్రో ట్రైన్ లాంటి రవాణా వ్యవస్థను ప్రయాణాల కోసం వినియోగిస్తున్నారు. అయితే, ఇందుకు చెక్ పెడుతూ.. ఎగిరే బైక్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
జపాన్‌కు చెందిన ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్‌లను తయారు చేసింది. దాని బరులు దాదాపు 300 కిలోలు. ఈ బైక్ విలువ 77.7 మిలియన్ యెన్‌లుగా నిర్ణయించారు. ఈ బైక్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాల్లో 40 నిమిషాలపాటు ప్రయాణం చేస్తుంది. నాలుగు విద్యుత్ బ్యాటరీల సహాయంతో ఈ బైక్ ప్రయాణం చేస్తుంది.
ఈ కొత్త ఆవిష్కరణతో తాము ప్రజలకు కొత్త జీవనశైలికి ఉపయోగపడుతుందని సంస్థ సిఇఒ డైసుకే కటానో తెలిపారు. ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు కూడా ఈ బైక్ ఉపయోగపడుతుందని జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎగిరే మోటార్ సైకిళ్లను విక్రయించే తొలి సంస్థగా A.L.I. నిలిచింది. ఇందు కోసం నాలుగేళ్లు చేస్తున్న కృషికి ఇప్పుడు ఫలితం వచ్చింది.
ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: అభ్యర్థులకు పండగే.. అదనంగా రెండు గంటల సమయం