2021 జనవరి 16… ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టినరోజు. ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న వేళ.. ఆశాదీపంలా దేశంలో టీకా ప్రక్రియ ప్రారంభమైంది. అయితే టీకాపై ఎన్నో అపోహలు, భయాలు నెలకొన్న సమయంలో విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించే కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజే…
ప్రపంచంలోనే రికార్డ్: ఎన్నో అనుమానాల నడుమ మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ… ఏడాది కాలంలోనే ఎన్నో విజయాలను నమోదుచేసింది. వ్యాక్సినేషన్ మొదలై నేటికి సంవత్సరం పూర్తవుతున్న వేళ 156 కోట్ల మైలురాయిని అధిగమించింది. అందులో 90కోట్ల మందికిపైగా మొదటి డోసు, 65కోట్ల మందికి పైగా రెండో డోసు… 42లక్షల మందికి ప్రికాషనరీ డోసును అందించి ప్రపంచంలోనే ఇండియా రికార్డు నెలకొల్పింది.
ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..