జనశక్తి అగ్రనేత కూర రాజన్నను కరీంనగర్ జిల్లా జైలులో కలిసేందుకు అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఇవ్వాల (బుధవారం) వచ్చారు. అయితే.. జైలు అధికారులు డైరక్ట్ ములాఖత్ ఇవ్వకుండా, జాలీ ములాఖత్‌కి అవకాశం ఇచ్చారు. జాలి ములాఖత్ ద్వారా మాట్లాడిన తర్వాత విమలక్క అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న కూర రాజన్నను కలిసేందుకు వస్తే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
ఉన్నతాధికారుల నుండి వచ్చిన అనుమతి ప్రకారమే తాము జాలీ ములాఖత్ కు అనుమతించామని జైలు అధికారులు అంటున్నారని, ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరించిందో అర్థం కావడం లేదన్నారు. వయసు పైబడ్డ కూర రాజన్న జాలీ ములాఖాత్ లో తనతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వం ములాఖత్ విషయంలో పునరాలోచించుకోవాలని విమలక్క కోరారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యం కోసం ఆసుపత్రికి తరించాలని.. లేకుంటే బే షరుతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.